
వసతి.. అథోగతి..!
భవనం అప్పగించాలి
మండలంలోని ఆయా గ్రామాల నుంచి రోజూ విద్యార్థినులు 3 కి.మీ. నడుచుకుంటూ పాఠశాలకు వస్తున్నారు. వంద మంది ఉండేలా హాస్టల్ నిర్మించారు. భవనానికి కరెంట్, తాగునీటి కనెక్షన్ ఇవ్వలేదు. చిన్ని చిన్న మరమ్మతులు చేయాల్సి ఉంది. వాటిని పూర్తి చేసి తమకు అప్పగిస్తే హాస్టల్‌ను ప్రారంభిస్తాం.
– అనీల, ప్రిన్సిపాల్, బషీరాబాద్ ఆదర్శ పాఠశాల
ప్రతిపాదనలు పంపాం
మోడల్ స్కూల్ హాస్టల్ భవనంలో చిన్నచిన్న మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇందుకు రూ.6.50 లక్షలు అవసరం. వారం రోజుల క్రితం ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం. హాస్టల్ బిల్డింగ్‌పై మరో ఫ్లోర్ వేయడానికి రూ.60 లక్షలతో ప్రతిపాదనలు పంపాం.
– శ్రీనివాసులు, డీఈ, టీఎస్‌ఈడబ్ల్యూఎస్
బషీరాబాద్: ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల్లో హాస్టల్ వసతి లేక విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2016లో అప్పటి సర్కారు వెనుకబడిన మండలాలకు మోడల్ స్కూల్స్ మంజూరు చేసింది. 2019లో బషీరాబాద్ మండలంలో రూ.1.28 కోట్లతో హాస్టల్ భవన నిర్మాణ పనులు చేపట్టారు. అన్ని సౌకర్యాలతో భవనాన్ని పూర్తి చేసి 2022లో టీఎస్‌ఈడబ్ల్యూడీసీ అధికారులు జిల్లా విద్యాశాఖకు అప్పగించారు. భవనం అందుబాటులోకి వచ్చి మూడేళ్లు గడిచిన హాస్టల్ ప్రారంభించలేదు. ప్రస్తుతం 120 మంది విద్యార్థినులు వసతి సౌకార్యం లేక రోజూ పాఠశాలకు 3 కి.మీ. కాలినడకన వచ్చి వెళ్తున్నారు.
దెబ్బతిన్న తలుపులు, కిటికీలు
మూడేళ్ల క్రితం పూర్తయిన హాస్టల్ భవనానికి తాగునీటి వసతి లేదు. కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. భవనం గురించి పట్టించుకునే వారు లేకపోవడంతో తలుపులు దెబ్బతిన్నాయి. కిటికీలు, అద్దాలుఽ పాడయ్యాయి. బాత్‌రూమ్‌లు, ఫ్యాన్లు పాడైపోయాయి. భవనం చుట్టూ, లోపల ముళ్ల చెట్లు ఏపుగా పెరిగాయి.
మూడేళ్లుగా నిరుపయోగంగా
మోడల్ స్కూల్ హాస్టల్
విద్యుత్, నీటి సదుపాయం
లేకపోవడంతో వృథాగా..
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

వసతి.. అథోగతి..!