
నిరుపయోగం.. కూలేందుకు సిద్ధం
దుద్యాల్: మండలంలోని గౌరారం, నాజుఖాన్‌పల్లి, హస్నాబాద్ గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంకులు పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. అవి ఎప్పుడు కూలుతాయోననే భయంతో ఆయా గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గౌరారంలో ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న వాటర్ ట్యాంకు శిథిలావస్థకు చేరడంతో నిరుపయోగంగా ఉంచారు. హస్నాబాద్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంకు తీవ్ర ప్రమాదకరంగా మారింది. వినియోగించక చాలా ఏళ్లు అవ్వడంతో ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థులు వాపోతున్నారు. నాజుఖాన్‌పల్లిలో ఓ వాటర్ ట్యాంకు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉంది. ప్రమాదాలు సంభవించకముందే అధికారులు స్పందించి ఆయా గ్రామాల్లో వాటర్ ట్యాంక్‌లను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
వాటర్ ట్యాంక్‌లతో పొంచి ఉన్న ప్రమాదం

నిరుపయోగం.. కూలేందుకు సిద్ధం