
రైతులకు అండగా కేంద్రం
అనంతగిరి: ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువతను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముద్ర రుణాలను కేంద్రం అందజేస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానంద్‌రెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ మండలంలోని రాళ్ల చిట్టెంపల్లి, మైలార్ దేవరంపల్లి గ్రామాల్లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం ప్రారంభించి, కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని రైతులకు పెట్టుబడి సహాయం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని వివరించారు. రైతులపై భారం పడకుండా ఎరువులను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు శివరాజ్ గౌడ్, జాయింట్ కన్వీనర్ అమరేందర్ రెడ్డి, నాయకులు మల్లేష్, ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
దోమ: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని మండల అధ్యక్షుడు బొంగు మల్లేశం అన్నారు. మంగళవారం దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామంలో బీజేపీ ప్రవేశపెడుతున్న పథకాలను కార్యకర్తలతో కలిసి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేరుగా అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు సత్యం, నాయకులు అశోక్, శ్రీనివాస్, శ్రీనుగౌడ్, వెంకటేశ్‌గౌడ్, శ్రీశైలం, మాదవులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానంద్‌రెడ్డి

రైతులకు అండగా కేంద్రం