
తాగునీరు కలుషితం
తాండూరు టౌన్: రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నిర్వహించిన తవ్వకాలతో తాగునీటి పైప్‌లైన్ పగిలిపోయింది. దీంతో నీరు కలుషితమవుతోంది. తాండూరు – చించోళి మార్గంలో సెయింట్ మార్క్స్ పాఠశాల సమీపంలో మిషన్ భగీరథ పైప్ పగిలిపోవడంతో నీరు బయటకు వచ్చి మడుగును తలపిస్తోంది. లీకేజీ నీటిలో పందులు పొర్లాడుతున్నాయి. కుక్కలు, పశువులు దాహం తీర్చుకుంటున్నాయి. ఆ నీరే ఇంకి పైపుల్లో కలిసి ఇళ్లకు సరఫరా అవుతోంది. నెల రోజులుగా ఇలాగే జరుగుతోందని అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంటనే పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.