పశు వైద్యంపై నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

పశు వైద్యంపై నిర్లక్ష్యం వద్దు

Aug 6 2025 8:17 AM | Updated on Aug 6 2025 8:25 AM

పశు వ

పశు వైద్యంపై నిర్లక్ష్యం వద్దు

అడిషనల్‌ కలెక్టర్‌ సుధీర్‌

అనంతగిరి: మూగజీవాలకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందాలని అదనపు కలెక్టర్‌ సుధీర్‌ సూచించారు. మంగళవారం వికారాబాద్‌లోని జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయం, పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు పడుతున్నందున మూగ జీవాలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. సమయపాలన పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డాక్టర్‌ విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.

ఎంఈఓ, హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు

తాండూరు రూరల్‌: పెద్దేముల్‌ మండలం తింసన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో 50 రోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంపై కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దేముల్‌ ఎంఈఓ తోపాటు హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని డీఈఓను ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తింసన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో 13 మంది విద్యార్థులు ఉన్నారు. వంట చేసేందుకు నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో విద్యార్థులకు భోజనం పెట్టడం లేదు. ఈ విషయం తెలుసుకున్న డీఈఓ రేణుకాదేవి శనివారం పాఠశాలను సందర్శించి కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎంఈఓ నర్సింగ్‌రావు, హెచ్‌ఎం ఫక్రుజమాకు షోకాజ్‌ నోటీసులతో పాటు చార్జి మోమో ఇచ్చినట్లు డీఈఓ తెలిపారు.

అరుణాచలేశ్వరుడి

సేవలో బీఎంఆర్‌

తాండూరు: తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణమలై అరుణాచల పుణ్యక్షేత్రాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి సందర్శించారు. మంగళవారం బీఎంఆర్‌ జన్మదినం కావడంతో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. తాండూరు నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

వయోజనుల కోసం ‘ఉల్లాస్‌’

కొడంగల్‌: చదువురాని వయోజనులు, నిరక్షరాస్యుల కోసం న్యూ ఇండియా లిటరసీ ప్రోగాం పేరుతో కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్‌ అనే కార్యక్రమం చేపట్టిందని ఉల్లాస్‌ జిల్లా అధికారి శ్రీనివాసులు, ఎంఈఓ రాంరెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలో ఐకేపీ, మెప్మా శాఖలకు చెందిన ఆర్‌పీలు, సీసీలతో సమావేశం నిర్వహించారు. మండలంలోని వయోజనులు, నిరక్షరాస్యులను గుర్తించాలన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి బోధనా కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. మహిళా సంఘాల సభ్యులు, సీసీలు, ఆర్‌పీలు బాధ్యత వహించి నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పాలన్నారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం గోపాల్‌, సీసీలు, మెప్మా సభ్యులు పాల్గొన్నారు.

యూరియా కొరత లేదు

యాలాల: జిల్లాలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రాజరత్నం తెలిపారు. మంగళవారం యాలాల, లక్ష్మీనారాయణపూర్‌లోని ఫెర్టిలైజర్‌ షాపులను మండల వ్యవసాయ అధికారి శ్వేతారాణితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తగినంతగా యూరియా వాడాలన్నారు. ప్రస్తుతం ఎకరాకు రెండు బస్తాల చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు.

పశు వైద్యంపై నిర్లక్ష్యం వద్దు 1
1/2

పశు వైద్యంపై నిర్లక్ష్యం వద్దు

పశు వైద్యంపై నిర్లక్ష్యం వద్దు 2
2/2

పశు వైద్యంపై నిర్లక్ష్యం వద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement