
ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు
తాండూరు రూరల్: మనిషికి ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ నాయక్ అన్నారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మండల కేంద్రమైన పెద్దేముల్‌లో ఎల్‌ఎన్‌ఆర్ యువసేన, ఎంఎన్‌ఆర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి ఒక్కరూ రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎల్‌ఎన్‌ఆర్ యువసేన వ్యవస్థాపకులు నర్సింలు ఆధ్వర్యంలో వృద్ధులకు చేతికర్రలు పంపిణీ చేశారు. అనంతరం కేక్‌కట్ చేశారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్‌కుమార్, గ్రామ కమిటీ అధ్యక్షుడు డీవై నర్సిలు, కో ఆప్షన్ మాజీ సభ్యుడు నసిరొద్దీన్, నాయకులు వెంకటయ్య, ఆనంద్‌చారి, రాంరెడ్డి, సంగమేశ్వర్, నాగభూషణం, ప్రకాష్‌రెడ్డి, రాములు, సురేష్, విజయ్, సచిన్, వెంకట్, దేవ్యాసింగ్, శ్రీను, వైద్యులు సుభాష్, ఇశ్వర్య, కావ్య, ఫజల్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిధారాసింగ్ నాయక్
పెద్దేముల్‌లో ఉచిత వైద్య శిబిరం