
అర్చకులు సంఘటితంగా ఎదగాలి
యాలాల: అర్చకులు సంఘటితంగా ఎదిగేందుకు కృషి చేయాలని దూప దీప నైవేద్య అర్చక సంఘం(డీడీఎన్‌ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ పిలుపునిచ్చారు. మంగళవారం కోకట్ రోడ్‌లోని షిరిడీ సాయిబాబా మందిర ఆవరణలో జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో చండీ, కుబేర పాశుపత యాగ విజయోత్సవ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్చకులకు కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్కారు అందిస్తున్న అర్చక సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీడీఎన్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లోకూర్తి జయతీర్థాచారి, మఠం రాజశేఖరస్వామి, విజయ కృష్ణజ్యోషి, కరణం శ్రీకాంత్ పంతులు, జంగం జగదీశ్వర్ స్వామి, నటరాజ స్వామి, కిరణ్‌కుమార్ జ్యోషి, సంతోష్ స్వామి, వికారాబాద్ శ్రీకాంత్ స్వామి, గౌరారం రఘు స్వామి, సుమన్ పంతులు తదితరులు పాల్గొన్నారు.
డీడీఎన్‌ఎస్ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవశర్మ