
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
పూడూరు: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మంగళవారం మండల కేంద్రంలో మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. కేంద్ర పథకాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల ప్రభారి శ్రీకాంత్, సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు మల్లేష్ పటేల్, పార్టీ మండల అధ్యక్షుడు రాఘవేందర్, నాయకులు జంగయ్య, బుచ్చన్న, పెద్దిని ప్రకాష్, కృష్ణాచారి, సుభాన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి