బడంగ్‌పేట్: మహేశ్వరం నియోజకవర్గంలోని లబ్ధిదారులకు మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరు కానున్నారని కాంగ్రెస్ పార్టీ మహే శ్వరం ఇన్‌చార్జ్ కేఎల్లార్ తెలిపారు. మల్లాపూర్‌లోని యెల్మేటి అమరేందర్‌రెడ్డి ఫంక్షన్ హాలులో కొనసాగుతున్న ఏర్పాట్లను సోమవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గానికి 12 వేల కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని స్పష్టంచేశారు. లబ్ధిదారులు విధిగా హాజరై కార్డులు అందుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు అమరేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు దేప భాస్కర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోవర్ధన్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, నవారు మల్లారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
‘డబుల్ ఇళ్లు’ స్థానికులకే ఇవ్వాలి
తుక్కుగూడ: గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను స్థానికులకే కేటాయించాలని నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజలు కోరారు. ఈ మేరకు తుక్కుగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఆయన అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్‌రూంల పనులను పూర్తి చేయాలని హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. వీటి పంపిణీలో స్థానికులకే మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు.
హాజరుకానున్న
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
ఏర్పాట్లను పరిశీలించిన
మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్