విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

Aug 5 2025 11:00 AM | Updated on Aug 5 2025 11:00 AM

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

కుల్కచర్ల: విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లోనూ రాణించాలని ముజాహిద్‌పూర్‌ ప్రభుత్వ మాడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ జ్యోతిహెప్సిబా అన్నారు. మండల పరిధిలోని ముజాహిద్‌పూర్‌ మాడల్‌స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న నరేశ్‌ ఈ నెల 2, 3 తేదీల్లో చైన్నైలోని రామకృష్ణ పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ పోటీలలో ప్రతిభను కనబరిచాడు. ఈ మేరకు ఆయన్ను జాతీయస్థాయి పోటీలకు ఎంపికచేశారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాల ఉపాధ్యాయ బృందం నరేశ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ కృష్ణారెడ్డి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement