
మొండి బకాయిల వసూలుకు చర్యలు
జాయింట్ రిజిస్ట్రార్ సూర్యచంద్రరావు
బంట్వారం: దీర్ఘకాలిక రుణాలు తీసుకొని చెల్లించని వారిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు హైదరాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ జాయింట్ రిజిస్ట్రార్ (ఓఎస్‌డీ) సూర్యచంద్రరావు తెలిపారు. సోమవారం బంట్వారం సహకార సంఘం కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సంఘం పరిధిలో రూ.5.32 కోట్ల రుణాలు రికవరీ చేయాల్సి ఉందన్నారు. మొండి బకాయి దారులకు మొదటగా నోటీసులు జారీ చేసి కొంత సమయం ఇస్తామన్నారు. వారి నుంచి స్పందన లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు దీర్ఘకాలిక రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించకుంటే వడ్డీ ఎక్కువ పడుతుందన్నారు. తీసుకున్న రుణాలను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తే ఎలాంటి నష్టం ఉండదన్నారు. కార్యక్రమంలో సేల్స్ ఆఫీసర్ డీఎల్‌ఎన్ రెడ్డి, మోమిన్‌పేట్ బ్రాంచ్ మేనేజర్ నారాయణరెడ్డి, సీఈఓ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ అసిస్టెంట్
ప్రదీప్‌కు పదోన్నతి
తాండూరు రూరల్: తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ ప్రదీప్‌కు పదోన్నతి లభించింది. డిప్యూటీ తహసీల్దార్‌గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రదీప్ హైదరాబాద్ జిల్లాకు డీటీగా వెళ్లారు. బదిలీపై వెళ్తున్న ఆయన్ను సోమవారం తహసీల్దార్ తారాసింగ్ తోపాటు సిబ్బంది ఘనంగా సన్మానించారు.
ప్రజా సమస్యలు
పరిష్కరించాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి
పరిగి: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి ప్రభుత్వాతన్ని డిమాండ్ చేశారు. సోమవారం పరిగి పట్టణంలో పార్టీ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా వెంకటేష్, కార్యవర్గ సభ్యులుగా రాంచంద్రయ్య, యాదయ్య, చంద్రయ్య, మల్లయ్య, జంగయ్య, రాములు, నజీర్, గఫార్, నర్సింహులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎంతో మంది నిరుపేదలు ఇళ్లు లేక రోడ్డు పక్కన జీవిస్తున్నారని తెలిపారు. అలాంటి వారికి ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. పలు గ్రామాల్లో భూ సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి పీర్ మహ్మద్, సురేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
సర్వేకు సహకరించాలి
యాచారం: ఫార్మాసిటీకి పరిహారం అందజేసి సేకరించిన భూముల సర్వేకు రైతులు సహకరించాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి అన్నారు. యాచారం మండలం పరిధిలోని నక్కర్తమేడిపల్లిలో అధికారులు చేపట్టిన రైతుల కబ్జా భూముల సర్వేను సోమవారం ఆమెపరిశీలించారు.

మొండి బకాయిల వసూలుకు చర్యలు