
సంజీవనిలా 108
● ప్రాణరక్షకులుగా సిబ్బంది ● అత్యవసర సమయాల్లో మెరుగైన సేవలు
తాండూరు రూరల్: దివంగత మహానేతవైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీసుకువచ్చిన 108 అంబులెన్స్ పథకానికి నేటికీ ఆదరణ కొనసాగుతోంది. ఆపదలో ఉన్న వారికి అంబులెన్స్ సిబ్బంది ప్రాణరక్షకులుగా నిలుస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకున్నా మొదట గుర్తుకువచ్చేది 108. ప్రమాదం చూసిన వారు తొలి స్పందనగా 108 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇస్తున్నారు. క్షతగాత్రులకు ప్రథ మ చికిత్స అందించడంతో రోగులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. దీంతో అంబులెన్స్ ప్రజలకు సంజీవనిగా నిలుస్తోంది. దేశంలోని 16 రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతోంది.
అత్యవసర సేవలు
108 అంబులెన్స్ వాహనంలో అత్యవసర సేవలు అందుతున్నాయి. శిక్షణ పొందిన ఈఎంటీ, పైలెట్ అందుబాటులో ఉంటారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే 108 సిబ్బంది వచ్చి అంబులెన్స్‌లో ప్రథమ చికిత్స అందించిన తర్వాత సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తుంటారు. వాహనంలో ఏఈడీ పరికరం, గుండె చికిత్సకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంటాయి. ఆక్సిజన్ పరికరాలు, ఆక్సీమీటర్, పురుగు మందు తాగితే కక్కించే యత్రం ఉంటాయి.
గర్బిణి కేసులు ఎక్కువ
108కు వచ్చే ఫోన్‌కాల్స్‌లో గర్భిణులకు సంబంధించినవే ఎక్కువ. మారుమూల ప్రాంతా ల్లోని గ్రామాలు, తండాల నుంచి గర్భిణులకు తాండూరు మాతాశిశు ఆస్పత్రికి తరలిస్తుంటారు. వాహనంలోనే సుఖ ప్రసవాలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
ప్రాణాలు కాపాడడమే కర్తవ్యం
కాల్ వచ్చిన వెంటనే లోకేషన్ నుంచి 30 సెకండ్లలోపు వా హ నం బయలుదేరుతుంది. జిల్లాలో 17 వాహనాలున్నాయి. అంబు లెన్స్‌లను నిత్యం తనిఖీ చేస్తున్నాం. మందులు, పరికరాలు అందుబాటులో ఉంచాం. ప్రమాదం జరిగిన వెంటనే వెళ్లి క్షత్రగాత్రులకు అంబులెన్స్‌లో ప్రథమ చికిత్స నిర్వహిస్తాం. వారి ప్రాణాలు కాపాడమే మా కర్తవ్యం.
– శ్రీకాంత్, జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్
ఉద్యోగంతో సంతృప్తి
12 ఏళ్లుగా పని చేస్తు న్నా. ఈ ఉద్యోగం కత్తిమీద సాము లాంటింది.రాత్రి, పగలు తేడా లేకుండా విధులు నిర్వర్తించాలి. ఫోన్‌కాల్ వచ్చిన క్షణాల్లో ప్రమాద స్థలానికి చేరుకోవాలి. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులకు వివరిస్తూ ఆస్పత్రికి తరలిస్తాం. ఇందుకు పైలెట్ల సహకారం మరవలేనిది. ఈ ఉద్యోగం ఎంతో సంతప్తినిస్తోంది.
– నర్సింలు, ఈఎంటీ, పెద్దేముల్
జిల్లాలో 15 నెలలుగా అందించిన సేవలు
మెడికల్ కేసులు 20,407
గర్భిణులు 5,424
యాక్సిడెంట్ 1,872
గుండె నొప్పి 771
బ్రీతింగ్ సమస్యలు 983

సంజీవనిలా 108

సంజీవనిలా 108

సంజీవనిలా 108