
నేడు ఇందిరానగర్‌లో వైద్య శిబిరం
తాండూరు టౌన్: పట్టణంలోని ఇందిరా నగర్‌లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి లలితా దేవి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ శిబిరం కొనసాగుతుందన్నారు. చెవి, ముక్కు, గొంతు, కళ్లు, కడుపులో గడ్డలు, మానసిక సమస్యల వంటి వాటికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. క్యాంపు ఇన్‌చార్జి డాక్టర్ గిరిధర్‌తో పాటు మరికొంత మంది స్పెషలిస్టు వైద్యులు ఈ శిబిరంలో సేవలందించనున్నట్లు చెప్పారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
రేపు జిల్లా స్థాయి
అథ్లెటిక్స్ పోటీలు
తాండూరు టౌన్: వికారాబాద్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల వయసు క్రీడాకారులకు మంగళవారం అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మధు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాము ఆదివారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని విలియంమూన్ గ్రౌండ్‌లో ఉదయం 8 గంటల నుంచి ఈ పోటీలు ప్రారంభమవుతాయన్నా రు.అండర్–8, 10 విభాగాల్లో బాలబాలికలకు 60 మీటర్ల పరుగు పందెం, బ్రాడ్ జంప్, అండర్–12 విభాగంలో 60 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, జావెలిన్ త్రో, అండర్–14 విభాగంలో జావెలిన్ త్రో, అండర్–6,18,20 విభాగాల్లో జావెలిన్ త్రో పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తహసీల్దార్ ధ్రువీకరించిన జనన పత్రంతో రావాలన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను నేరుగా రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. వివరాలకు 63000 75229, 99513 43432 నంబర్లలో సంప్రదించాలన్నారు.
చంద్రకల్ వాసికి డాక్టరేట్
దౌల్తాబాద్: మండల పరిధిలోని చంద్రకల్ గ్రా మానికి చెందిన దేవయ్య, శకుంతల కుమార్తె సరిత ప్రొఫె సర్ జయశంకర్ వర్సిటీలో ఆదివారం డాక్టరేట్ పట్టా పొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయంలో నేల నాణ్యత పెరుగుదలపై అసిస్టెంట్ ప్రొఫెసర్ జయశ్రీ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసినట్లు వివరించారు. డాక్టరేట్ పొందిన సందర్భంగా సరితను కుటుంబసభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు అభినందించారు.
బాలేశ్వర్‌గుప్తాకు
సత్కారం
యాలాల: లలిత కళా సమాఖ్య ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ సువర్ణ కంకణ అవార్డుల సంబురాలను ఆదివారం హైదరాబాద్‌లోనిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సేవ ఎంపీపీగా బాలేశ్వర్‌గుప్తాకు నిర్వాహకు లు జ్ఞాపికను అందజేసి సన్మానించారు. ఈ అవార్డుల కార్యక్రమానికి ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, సినీనటుడు శివాజీ రాజా, జనార్థన్‌రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలేశ్వర్‌గుప్తా మాట్లాడుతూ.. ఉత్తమ సేవా విభాగంలో భాగంగా తనను గుర్తించడం సంతోషించ తగిన విషయమన్నారు.
పేలిన లారీ టైరు
● అక్కడికక్కడే డ్రైవర్ మృతి
● హనుమకొండ జిల్లా వంగపహాడ్ సమీపంలో ఘటన
● మృతుడు జిల్లా వాసి
హసన్‌పర్తి: టైరును పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు పేలింది. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం హనుమకొండ జిల్లా వంగపహాడ్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జిల్లా పరిధిలోని తాండూరుకు చెందిన పి.సాయిలు(40) షాబాద్ బండల లోడ్ లారీతో జాతీయ రహదారిపై ములుగు వైపునకు బయలుదేరాడు. ఈ క్రమంలో వంపగహాడ్ సమీపంలో లారీ ఆపి టైరును పరిశీలిస్తుండగా ఒకేసారి పేలింది. ఈ ఘటనలో సాయిలు అక్కడకక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నేడు ఇందిరానగర్‌లో వైద్య శిబిరం