
రక్తదానం.. ఆరోగ్యానికి మంచిది
కొడంగల్ కోర్టు సివిల్ జడ్జి శ్రీరామ్
కొడంగల్: రక్తదానం చేయడం ఆరోగ్యానికి మంచిదని కొడంగల్ కోర్టు సివిల్ జడ్జి శ్రీరా మ్, వికారాబాద్ జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ రవీంద్రా యాదవ్, సీఐ శ్రీధర్‌రెడ్డి అన్నా రు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివా రం యువసేన ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రక్తదానం శిబిరం ఏర్పా టు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు 56 మంది యువకు లు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అతిథు లు మాట్లాడుతూ.. రక్తదానం చేయడంతో కొ త్త రక్తం ఉత్పత్తి అవుతుందన్నారు. దీంతో శరీ ర భాగాలు చురుకుగా పని చేస్తాయని చెప్పా రు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు నిర్వ హించిన పరిశోధనలో రక్తదానం చేసిన వారి జీవిత కాలం నాలుగేళ్లు పెరిగినట్లు తేలిందన్నారు.
రోడ్లకు మరమ్మతు చేపట్టాలి
కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య
యాలాల: మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్–దేవనూరు మార్గంలో అధ్వానంగా మారిన రోడ్డుకు మరమ్మతు పనులను చేపట్టాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కేవీపీఎస్ నాయకులతో కలిసి దెబ్బతిన్న రోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. లక్ష్మీనారాయణపూర్–బెన్నూరు మార్గంలో మరమ్మతు పనుల పేరిట గతంలో తవ్వి వదిలేశారని, ఈ ప్రాంతంలో వాహనదారులు అవస్థలు పడుతున్నారన్నారు. అసంపూర్తిగా మారిన రోడ్డు విషయంలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి చొరవ చూపి మరమ్మతు పనులు చేపట్టేలా చూడాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో యాదప్ప, చిన్న, ఫాజిల్, ఎల్లప్ప, నర్సింలు, పాండుగౌడ్ తదితరులు ఉన్నారు.
ప్రభుత్వాస్పత్రిలో కంటి పరీక్షలు
కొడంగల్: కంటి సమస్యలు ఉన్న వారికి పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నట్లు డిప్యూ టీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవీంద్రాయాదవ్ అన్నారు. గత నెల 22వ తేదీన కంటి ఆపరేషన్లు చేసిన వారికి ఆదివారం స్థానిక ఆస్పత్రిలో పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. కొన్నేళు్‌ాల్గ స్థానిక ప్రభుత్వాస్పత్రిలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ, వైద్యారోగ్య శాఖ, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆప్తాల్మిక్ అధికారి లయన్ హరినాథ్ వైద్య పరీక్షలు చేస్తున్నారు. కంటి ఆపరేషన్లు అవసరం ఉన్న వారిని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రాంరెడ్డి కంటి ఆస్పత్రికి తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నారు.
అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ లభ్యం
తిరుపతిలో ప్రత్యక్షం
పూడూరు: మండలంలోని మన్నెగూడ కేశవరెడ్డి పాఠశాలలో అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ లభ్యమైంది. చన్గోముల్ ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కేశవరెడ్డి పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్న కె. ఈశ్వర్ (12) ఈ నెల 2న పాఠశాల నుంచి కనిపించకుండా వెళ్లిపోయాడు. ఈ విషయం గురించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పాఠశాల సిబ్బంది ఆరా తీయగా పాఠశాల గోడదూకి పారిపోయినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. దీంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. గోడ దూకి వెళ్లిన విద్యార్థి ఇంటికి రాలేదని, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ విక్రం, విద్యార్థి కుటుంబ సభ్యులు చన్గోముల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థి కనిపించకుండ పోయిన విషయాన్ని సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశారు. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులకు దొరికినట్లు తెలిపారు. వారు విద్యార్థినుంచి పూర్తి వివరాలు సేకరించి తిరుపతిలోని కేశవరెడ్డి పాఠశాల బ్రాంచిలో బాలుడిని అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

రక్తదానం.. ఆరోగ్యానికి మంచిది

రక్తదానం.. ఆరోగ్యానికి మంచిది