
పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి
షాబాద్: పరిశ్రమల ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభు త్వం కృషి చేస్తుందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. షాబాద్ మండలం చందనవెళ్లి పారిశ్రామిక వాడలో నీలోఫర్ బాబురావు ఏర్పాటు చేసిన నీలోఫర్ టీ ఫౌడర్ ప్యాకింగ్ కర్మాగారాన్ని ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్ది, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అనేక ప్రోత్సాహాకాలను అందజేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అశోక్, మాజీ సర్పంచ్‌లు జనార్దన్‌రెడ్డి, లింగం, నాయకులు అశోక్, రాఘవేందర్, నర్సింహారెడ్డి, సూర్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మేయర్ గద్వాల విజయలక్ష్మి