
ఫోన్ అప్పగింత
మహేశ్వరం: 108లో మరిచిన మొబైల్ ఫోన్‌ను.. అంబులెన్స్ సిబ్బంది రోగి బంధువుకి అప్పగించి నిజాయతీని చాటుకున్నారు. కందుకూరు మండలం మీర్కాన్‌పేట్ గ్రామానికి చెందిన నందిగామ లక్ష్మమ్మ(75) అనారోగ్యానికి గురి కావడంతో బంధువులు అంబులెన్స్‌లో చికిత్స కోసం తరలించారు. ఆస్పత్రికి తరలించే క్రమంలో రోగి బంధువులు.. తమ ఫోన్‌ను వాహనంలో వదిలి వెళ్లిపోయారు. మండల కేంద్రం చేరుకున్న వాహన సిబ్బంది.. సెల్‌ను గమనించి రోగి బంధువులకు సమాచారం అందించి అప్పగించారు. దీంతో ఈఎంటీ కుమార్, ఫైలట్ యాదయ్యను వారు అభినందించారు.