
ఫోన్ కాల్‌తో స్పందించారు..బాలికను కాపాడారు..
నిజాంపేట్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సతీష్‌కుమార్‌కు శనివారం ఒడిశాలోని కటక్ నుంచి ఓ ఫోన్ వచ్చింది. దక్షిణాసియా మహిళా ఫౌండేషన్‌లో ప్రోగ్రాం ఆఫీసర్‌గా పని చేస్తున్న తాన్వి సింగ్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఒడిశా రాష్ట్రం, కేంద్రపాడా జిల్లా, ఔల్ మండలం, సహిరా గ్రామానికి చెందిన బాలిక(16) అపహరణకు గురైందని, ఆమెను బాచుపల్లిలోని ఓ ఇంట్లో నిర్భందించినట్లు సమాచారం అందించాడు. దీంతో తక్షణమే స్పందించిన ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్ గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో కొద్ది గంటల్లోనే బాలికను ఇందిరానగర్‌లోని ఓ ఇంట్లో బంధించినట్లు గుర్తించి రక్షించారు. అనంతరం ఆమెను సూరారంలోని సఖి సెంటర్‌కు తరలించారు. ఆమె తలిదండ్రులు లేదా ఒడిశా పోలీసులకు అప్పగించే వరకూ తాత్కాలిక రక్షణలో ఉంచనున్నట్లు ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు.
ఒడిశా నుంచి సమాచారం
అప్రమత్తమై బాలికను కాపాడిన బాచుపల్లి పోలీసులు