
జాలీగా.. అ‘పూర్వ’ కలయిక
శంషాబాద్: మూడు దశాబ్దాల క్రితం పదో తరగతి చదువుకున్న అలనాటి స్నేహితులంతా ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా కలిశారు. నాటి స్నేహితులు ఒకే చోటి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుని మురిసిపోయారు. శివరాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1993వ సంవత్సరం పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని ఎంజాయ్ చేశారు. ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు కట్టుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇటీవల ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికై న తమ తోటి స్నేహితుడు సంకూరి జయప్రకాశ్‌ను ఘనంగా సన్మానించారు. శారీక వైకల్యంతో బాధపడుతున్న మరో స్నేహితుడు భాస్కరాచారికి ఆర్థికంగా సాయం అందజేసి మేమున్నామంటూ భరోసానిచ్చారు. కార్యక్రమంలో న్యాయవాది ఎస్.వెంకట్‌రెడ్డి, డాక్టర్ ఎ.కృష్ణ, భాగ్యలక్ష్మి, ఎన్.వరలక్ష్మి, సరిత, రజిత, బి.వరలక్ష్మి, పద్మావతి, ఎస్.కిరణ్, మహ్మద్ ఆసిఫ్, లక్ష్మణ్‌ప్రసాద్, టి.నర్సింహ, చందు, మహేందర్, దాసు,సురేష్, సాయిబాబా, సత్యనారాయణ, యూసుఫ్, నర్సింగ్‌రావు, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.