
భారతి సిమెంట్‌కు తిరుగులేదు
అనంతగిరి: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్ అల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ 5స్టార్ గ్రేడ్ తెలంగాణలో విడుదల చేసిందని ఆ సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ తెలిపారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల చిట్టంపల్లిలో శ్రీ వేంకటేశ్వర డీలర్ షాపులో శుక్రవారం రాత్రి తాపీమేసీ్త్రలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్‌లో లభించే ఇతర సిమెంట్‌తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్‌తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందని తెలిపారు. అల్ట్రాఫాస్ట్‌తో ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలకు సరైన ఎంపిక అన్నారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందజేస్తామని స్లాబ్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి సహాయపడుతారని తెలియచేశారు. ఈ సందర్భంగా తాపీమేసీ్త్రలకు రూ.లక్షతో కూడిన ప్రమాద బీమా బాండ్లను 30 మందికి అందజేశారు. అనంతరం డీలర్ వెంకటేష్ మాట్లాడుతూ.. భారతి సిమెంట్ సర్వీస్ చాలా ఫాస్ట్‌గా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో తాపీమేసీ్త్రలు, వినియోగదారులు, కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్