హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రఘునాథ్
అనంతగిరి: అందరూ ఏకమైతే అడ్వకేట్ల రక్షణ చట్టం అమలవుతుందని హైకోర్టు సీనియర్ న్యాయవాది రఘునాథ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం వికారాబాద్ బార్ అసోసియేషన్‌లో ఏర్పాటు చేసిన న్యాయవాదుల సెమినార్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. న్యాయవాదులకు రక్షణ చట్టం అమలులో లేనందున దాడులు మరింత పెరిగాయని, ఎక్కడో ఒక చోట నిత్యం దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఇచ్చే 41ఎ స్టేషన్ బెయిల్‌లతో న్యాయవాదులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. ఈ విషయంలో ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బస్వరాజ్ పటేల్, ఉపాధ్యక్షుడు శంకరయ్య, సెక్రటరీ వెంకట్‌రెడ్డి, న్యాయవాదులు గోవర్ధన్ రెడ్డి, సంపూర్ణనంద్, గోపాల్‌రెడ్డి, కమాల్‌రెడ్డి, శ్రీనివాసరావు, యాదవరెడ్డి, వసుందర, మహేశ్‌కుమార్ పాల్గొన్నారు.