
క్షతగాత్రుడికి స్పీకర్ పరామర్శ
ధారూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి పట్ల శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ధారూరు రైతు వేదికలో కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేసి తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. అనంతగిరి చివరిగుట్ట రోడ్డు పక్కన ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి కన్పించాడు. వెంటనే తన కాన్వాయ్‌ని నిలిపివేయించి క్షతగాత్రుని వద్దకు చేరుకుని ఆరా తీశారు. ముందుగా గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స చేయించి, 108కు ఫోన్ చేయించారు. అతనికి మెరుగైన చికిత్స అందించేలా చూడాలని డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు. అంబులెన్స్ తొందరగా రాకపోవడంతో క్షతగాత్రున్ని పోలీసు వాహనంలో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.