
నేడు ఎమ్మార్పీఎస్ మహాగర్జన
కొడంగల్: పట్టణంలోని మురహరి ఫంక్షన్ హాల్‌లో శనివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మహా గర్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. శుక్రవారం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వీహెచ్‌పీఎస్ జాతీయ గౌరవ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు, అందె రాంబాబు, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ల శివ, పిల్లికండ్ల ఆనంద్ మాట్లాడారు. మహా గర్జనకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరుకానున్నట్లు చెప్పారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అనుబంధ సంఘాల నాయకులు ప్రకాశ్, అంజి, రమేష్‌బాబు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్‌లో బహిరంగ సభ
హాజరుకానున్న మందకృష్ణ మాదిగ
విజయవంతం చేయాలని నేతల పిలుపు