
‘జుంటుపల్లి’ అభివృద్ధికి రూ.5.71 కోట్లు మంజూరు
యాలాల: మండలంలోని జుంటుపల్లి ప్రాజె క్టు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5.71 కోట్లను మంజూరు చేసింది. ఇరిగేషన్ శాఖ సాధారణ పరిపాలన విభాగం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టుతోపాటు కుడి, ఎడమ కాల్వల మరమ్మతులు, అభివృద్ధి పనులకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. జిల్లా అధికారులు రూ.6.80 కోట్లతో ప్రతిపాదనలు పంపగా రూ.5.71 కోట్లు మంజూరయ్యాయి.
భోజనం తయారీలో రాజీవద్దు
కలెక్టర్ ప్రతీక్‌జైన్
నవాబుపేట: వసతి గృహాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కేజీబీవీ, బీసీ వసతి గృహాన్ని సందర్శించారు. భోజనం, వసతులపై ఆరా తీశారు. భోజనం విషయంలో రాజీ పడరాదన్నారు. ఆగస్టు 15లోగా బీసీ వసతి గృహ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులు ఇంగ్లిష్‌లో మాట్లాడటం అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బుచ్చ య్య, ఎంపీడీఓ అనురాధ, ప్రిన్సిపాళ్లు కృష్ణకుమార శ్రీలత, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
‘డబుల్’ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలి
తాండూరు టౌన్: తాండూరు పట్టణ శివారులో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని సీపీఎం, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. డబుల్ ఇళ్ల ఆశ చూపి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా పేదలకు పంపిణీ చేయడం లేదన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కె.శ్రీనివాస్, మహిపాల్, సతీష్, రాములు, చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.
ఒకటో తరగతిలో ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం
అనంతగిరి: నగరంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. బేగంపేట, రామంతాపూర్‌లోని స్కూళ్లలో 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం ఎస్సీ, ఎస్టీ బాలబాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ నెల 8లోపు దరఖాస్తులు పంపాలని సూచించారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ల 86393 88553, 99085 98481లో సంప్రదించాలని కోరారు.
నేడు కేంద్ర మంత్రి రాక
యాచారం: కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి శనివారం మండలానికి రానున్నట్లు కృషి విజ్ఞాన కేంద్రం జిల్లా శాస్త్రవేత్త శ్రీకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారాణాసిలో పీఎం కిసాన్ 20వ విడత నిధులు విడుదల చేస్తున్న సందర్భంగా యాచారం మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగే కార్యక్రమంలో వీడియో ప్రసంగం వీక్షించనున్నట్టు తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో కేంద్రమంత్రితో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, రైతులు పాల్గొంటారని చెప్పారు.

‘జుంటుపల్లి’ అభివృద్ధికి రూ.5.71 కోట్లు మంజూరు