
ఏం చేశారని పాదయాత్ర?
అనంతగిరి: జిల్లాకు ఏం చేశారని పాదయాత్ర చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం సొంత జిలా్‌ల్ వికారాబాద్‌కు చేసిందేమీలేదని ఆరోపించారు. శుక్రవారం వికారాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీరు ఏ ఎజెండాతో పాదయాత్ర చేస్తున్నారో జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కాకుండా మీరేందుకు పాదయాత్ర చేస్తున్నారు అనే దానిపై ప్రజలకు సందేహాలు ఉన్నాయన్నారు. అనంతగిరి టూరిజం అభివృద్ధిపై ఏమైనా మాట్లాడుతారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ – మన్నెగూడ రోడ్డు విస్తరణ పనులు ఎందుకు కావడం లేదో ప్రజలకు చెప్పాలన్నారు. మీరు పాదయాత్ర చేసే మార్గంలో నేషనల్ హైవే కాకుండా గుంతలు లేని రోడ్డు చూపించగలరా అని అన్నారు. ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లుల విడుదల విషయంలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్ర ప్రజల్లో విశ్వాసం కోల్పొయినందుకా.. లేక ప్రజాదారణ తగ్గిందని చేస్తున్నారా అనే సందేహం చాలా మందిలో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నమ్మదని, కుటుంబ పాలనను నమ్ముతుందన్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏమయ్యిందో ప్రజలకు చెప్పాలన్నారు. ఆరు గ్యారంటీల అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ పాలనలో దళారీ వ్యవస్థ పెరిగి రైతులకు యూరి యా కొరత సృష్టిస్తోందని మండిపడ్డారు. మహిళలకు రూ.2500, నిరుద్యోగ భృతి, పెన్షన్‌ల పెంపు, ఉద్యోగాల భర్తీ ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానందరెడ్డి, దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నవీన్‌కుమార్, పార్లమెంట్ కో– కన్వీనర్ అమరేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు శివరాజుగౌడ్, జిల్లా నాయకులు రాజు, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి
మీనాక్షి నటరాజన్‌కు ప్రశ్నల వర్షం