
కార్యకర్తల కృషితోనే అధికారం
పరిగి/దోమ: కార్యకర్తల కృషి, శ్రమతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రు లు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రచా ర కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. శుక్రవారం పరిగి పట్టణ పరిధిలోని గిరిజన బాలికల పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో కలిసి శ్రమదానం చేశారు. జనహిత పాదయాత్రలో భాగంగా మీనాక్షి నటరాజన్ గురువారం సాయంత్రం పరిగికి చేరుకున్నారు. రాత్రి స్థానిక ఎస్ గార్డెన్‌లో బస చేశారు. ఉద యం బాలికల పాఠశాలను సందర్శించి మొక్క లు నాటారు. పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యమని పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని ఎస్‌గార్డెన్ చేరుకొని చరకతో నూలు తయారు చేశారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ గాంధీ మార్గాన్ని అనుసరించాలని కోరారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. పట్టణంలోని ఎస్ గార్డెన్‌లో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో పార్టీ పటిష్టంగా ఉండాలంటే నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. భేదాభిప్రాయాలు లేకుండా అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని చెప్పారు. కార్యకర్తల సేవలకు గుర్తింపు ఉంటుందన్నారు. ఇందిరమ్మ కమిటీల్లో వారికి ప్రాధాన్యత కల్పించినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్య త కార్యకర్తలదే అన్నారు. అందరూ శ్రమిస్తే స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, ఎమ్మెల్యేలు పర్నికారెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, యాదయ్య, బుయ్యని మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరికీ సంక్షేమం
అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేసిందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి ఇక్క ఇల్లు కూడా కట్టించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ప్రతి నియోజకవర్గానికీ 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు.
ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్
పరిగి గిరిజన గురుకులంలో శ్రమదానం
పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్