
సదస్సును జయప్రదం చేయండి
బొంరాస్‌పేట: వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, చేయూత పింఛన్లు వెంటనే పెంచాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్రస్థాయి సదస్సును విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్‌మాదిగ కోరారు. మంగళవారం మెట్లకుంటలో దివ్యాంగులతో కలిసి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ మొత్తం పెంచుతామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై హైదరాబాద్‌లో ఆగస్టు 13న మహాగర్జన ఉంటుందన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 2వ తేదీ కొడంగల్‌లో సన్నాహక సదస్సు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరుకానున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు నరసింగరావు, ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్ ప్రకాశ్ మాదిగ, వీహెచ్‌పీఎస్ నాయకులు వెంకటయ్య, మల్లేశ్, యాదయ్య, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ మాదిగ