
వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి
యాలాల: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి అని యాలాల పీహెచ్‌సీ వైద్యాధికారి రుబియా నాజ్ అన్నారు. మంగళవారం ఆమె మండల కేంద్రంలోని బాలికల వసతి గృహాన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం జిల్లా ఇన్‌చార్జి డాక్టర్ గోపాల్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు వేడి భోజనంతో పాటు కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలన్నారు. మలేరియా, డెంగీ, చికున్ గున్యా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చే అవకాశం ఉందని.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పీహెచ్‌సీలో పరీక్షలు చేసుకుని మందులు తీసుకోవాలన్నారు. అనంతరం వసతి గృహంలోని వంట సరుకులు, బియ్యం, కూరగాయలను పరిశీలించి వసతి గృహ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ చంద్రప్రకాశ్, పీహెచ్‌ఎన్ సుశీల, సూపర్‌వైజర్ శోభారాణి, పల్లె దవాఖాన డాక్టర్ స్రవంతి, ఏఎన్‌ఎం లక్ష్మీ తదితరులు ఉన్నారు.
పీహెచ్‌సీ వైద్యాధికారి రుబియా నాజ్