
రేపు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
తాండూరు టౌన్: వికారాబాద్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం తాండూరులో జిల్లాస్థాయి జూనియర్స్ అండ్ సీనియర్స్ బాలబాలికలకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు. గురువారం ఈ మేరకు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం మధు, కార్యవర్గ సభ్యుడు రాము ఒక ప్రకటన విడుదల చేశారు. తాండూరు పట్టణ శివారులోని పాత శాలివాహన డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయం 8గంటలకు అండర్ 14, 16, 18, 20 బాలబాలికలకు పలు విభాగాల్లో పరుగు పందెం పోటీలు ఉంటాయన్నారు. అలాగే లాంగ్ జంప్, షాట్‌పుట్ అంశాల్లో కూడా పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు వారు తెలిపారు. క్రీడాకారులు తప్పకుండా తహసీల్దార్‌చే జారీ చేసిన జనన ధ్రువీకరణ ప్రతాన్ని తీసుకురావాలని సూచించారు.
2న కొడంగల్‌లో
సన్నాహక సదస్సు
బొంరాస్‌పేట: పింఛన్లు పెంచాలనే డిమాండ్‌తో ఈ నెల 2న కొడంగల్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సన్నాహక సదస్సు నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ మాదిగ తెలిపారు. గురువారం మండల కేంద్రంలో పింఛనుదారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సన్నాహక సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ మాదిగ, మండల ఇన్‌చార్జ్ గజ్జెల ప్రకాశ్, నాయకులు గట్టెగాళ్ల ప్రశాంత్, శ్రీనివాస్, దుడ్డు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కొత్త పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తాం
కొడంగల్: నియోజకవర్గంలో 1,200 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్‌లో కొత్త పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేస్తామని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్లకు ఇబ్బంది లేకుండా రెండో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీనికి అఖిల పక్ష నాయకులు అంగీకరించారు. సమావేశంలో తహసీల్దార్ విజయ్‌కుమార్, డీటీ శ్రీనివాస్, అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు.
‘కోట్‌పల్లి’కి వరద
ధారూరు: జిల్లాకే తలమానికమైన కోట్‌పల్లి ప్రాజెక్టులోకి గురువారం నాటికి నాలుగు అడుగుల మేర నీరు చేరింది. ప్రాజెక్టు మొత్తం 24 అడుగులు కాగా 8 అడుగులకు నీరు తగ్గింది. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు ధర్మాపూర్, కోట్‌పల్లి వాగులు ప్రవహిస్తూ ప్రాజెక్టులోకి నీటి ఫ్లో ప్రారంభమైంది. క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతూ వస్తోంది.ఇదే తరహాలో వర్షాలు పడితే ఆగస్టులోగా ప్రాజెక్టు నిండే అవ కాశం ఉందని ప్రాజెక్టు ఏఈ హేమ తెలిపారు.

రేపు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు

రేపు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు