
క్యూ..!
శనివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2025
జిల్లాలో ఎరువుల కోసం బారులు తీరుతున్న రైతులు
● వెంటాడుతున్న యూరియా కొరత ● అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాదారులు ● ఆందోళనలో అన్నదాతలు
8లోu
వికారాబాద్: జిల్లాలో ఎరువుల కొరత రైతన్నను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వానాకాలం సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఫెర్టిలైజన్ దుకాణాల్లో ఎరువులు దొరక్క రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సారి వర్షాలు ముందుగానే కరిసినా మధ్యలో గ్యాప్ ఇచ్చాయి. దీంతో రైతులు వర్షాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్న నేపథ్యంలో ఎరువులు వేసేందుకు మంచి అదునుగా మారింది. దీంతో ఎరువులు కొనేందుకు రైతులు క్యూ కడుతున్నారు. దుకాణాల వద్ద వందల సంఖ్యలో బారులు తీరుతున్నారు. ఒక్కొక్కరికి రెండు బ్యాగులు మాత్రమే ఇస్తుండటంతో మీళ్లీ రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పత్తి, కంది, మొక్కజొన్న తదితర పంటలకు పైపాటిగా ఎరువులు వేస్తున్నారు. వరినాట్లు కూడా ప్రారంభమవుతున్నందున యూరియాకు డిమాండ్ పెరిగింది. విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచిన అధికారులు ఎరువుల కొరతను మాత్రం తీర్చలేకపోతున్నారు. జిల్లాకు అవసరమైన ఎరువుల్లో 25 శాతం కూడా ప్రస్తుతం అందుబాటులో లేవు. డీఏపీ, యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ఫెర్టిలైజర్ దుకాణ యజమానులు ఎక్కువ ధరకు ఎరువులు విక్రయిస్తున్నారు.
ఉన్నది కొంతే
జిల్లాలో ఎరువుల అవసరం కొండంత ఉంటే అందుబాటులో ఉన్నది గోరంత అన్నచందంగా పరిస్థితి తయారయ్యింది. ప్రస్తుత సీజన్‌లో 5,61,719 ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. 1,13,851 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం 12,540 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందులో యూరియా 39,898 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇప్పటి వరకు 10 వేల మెట్రిక్ టన్నులే పంపిణీ చేశారు. మరో 5,500 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. డీఏపీ 27,516 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 8,51 మెట్రిక్ టన్నులే ఉంది. ఎంఓపీ 8,585 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా 128 మెట్రిక్ టన్నులే ఉంది. కాంప్లెక్స్ ఎరువులు 35,305 మెట్రిక్ టన్నులు కావాల్సి ఉండగా 4,295 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచారు. ఎస్‌ఎస్‌పీ ఎరువులు 2,547 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 201 మెట్రిక్ టన్నులే ఉంది.
బారులు తీరుతున్న రైతులు
ఎరువుల నిల్వలపై అధికారులు చెబుతున్న మాటలకు వాస్తవ పరిస్థితులకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. ఎరువుల కొరత లేదని అధికారులు చెబుతున్నా దుకాణాల వద్ద రైతుల భారీ క్యూలు కనిపిస్తున్నాయి. పొలం పనులు కూడా వదులుకొని ఎరువుల కోసం తిరగాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాగు అంచనా 5.61లక్షల ఎకరాలు
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 5.61లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గతేడాది 2.57 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా ఈ సారి2.58 లక్షల ఎకరాల్లో సాగు చేయవచ్చని భావిస్తున్నారు. వరి 1,31,075 ఎకరాల్లో, కంది 1.10 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 26,908 ఎకరాల్లో, పెసర 14,568 ఎకరాల్లో, మినుములు 5,716 ఎకరాల్లో, జొన్న 2,572 ఎకరాల్లో, సోయాబీన్ 2,043 ఎకరాల్లో, ఇతర పంటలు 7,275 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. ఇప్పటి వరకు 4 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేశారు.
న్యూస్‌రీల్
ప్రస్తుత సీజన్‌కు అవసరమైన
ఎరువులు 1,13,851 మెట్రిక్ టన్నులు
అందుబాటులో ఉన్నది 12,540 మెట్రిక్ టన్నులు
అవసరమైన యూరియా 39,898 మెట్రిక్ టన్నులు
అందుబాటులో ఉంది 6,065 మెట్రిక్ టన్నులే
సాగు విస్తీర్ణం అంచనా 5,61,719ఎకరాలు
ఆందోళన వద్దు
జిల్లాకు ఏమేర ఎరువులు అవసరమో ప్రభుత్వానికి నివేదిక పంపాం. సాగుకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాం. డీఏపీ, యూరియా పంపిణీ చేస్తున్నాం. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏరోజుకారోజు ఎరువులు తెప్పించి అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైనా ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం.
– రాజరత్నం, జిల్లా వ్యవసాయాధికారి

క్యూ..!

క్యూ..!

క్యూ..!