
ముంపు సమస్య రానివ్వం
● చిలుక వాగు ప్రక్షాళన పనులను సకాలంలో పూర్తి చేస్తాం ● తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు/బషీరాబాద్: చిలుక వాగు ప్రక్షాళన పనులను సకాలంలో పూర్తి చేసి ముంపు సమస్యను పరిష్కరిస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని కొడంగల్ – హైదరాబాద్ మార్గంలో చిలుక వాగుపై నిర్మించిన బ్రిడ్జిని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిడ్జి పనుల కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదే శించారు. వర్షాలు తగ్గిన వెంటనే రోడ్డు అనుసంధాన పనులను ప్రారంభించాలని సూచించారు. చిలుకవాగు ప్రక్షాళనకు మరో రూ.40 కోట్లు అవసరం అవుతాయని, ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్‌లాల పాల్గొన్నారు.
స్థల పరిశీలన
నియోజకవర్గంలోని చెంచు కుటుంబాలకు ఇళ్లు మంజూరైన నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి చైతన్య నగర్ శివారులోని మూడేకరాల స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి అటవీ శాఖ అధికారులు అడ్డు చెబుతున్నారని తహసీల్దార్ వెంకటప్రసాద్ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సర్వే నంబర్ 114, 115లో ఉన్న స్థలాన్ని చెంచుల ఇళ్ల కోసం కేటాయించాలని కోరారు. ఇళ్ల నిర్మాణానికి భూమి కేటాయిస్తామని కలెక్టర్ తెలిపారు.
సొసైటీలకు ప్రభుత్వ సహకారం
రైతు సహకార సంఘాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుందని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బషీరాబాద్ సొసైటీ ఆధ్వర్యంలో రూ.2.65 కోట్లతో నిర్మించిన రైస్ మిల్లు, గోదాంను డీసీసీబీ చైర్మన్ సత్యయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొసైటీలకు వచ్చే ఆదాయంతో రైతులకు మరిన్ని రుణాలు ఇవ్వాలని సూచించారు. సొసైటీ పాలకవర్గాలను ఆగస్టు వరకు పొడగించినట్లు తెలిపారు. యాలాల, తాండూరు మండలాల్లో చేపట్టిన గోదాంలు, రైస్ మిల్లులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీసీ బీ ఉపాధ్యక్షుడు రవి గౌడ్, చైర్మన్ వెంకట్‌రామ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, డీసీఓ నాగార్జున,నాయకులు అజయ్‌ప్రసాద్,నర్సింలు,రాము, చందర్, సొసైటీ సీఈఓ వెంకటయ్య పాల్గొన్నారు.