
స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి
పరిగి: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నిలకు బీజేపీ నాయకులు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవా రం పరిగి పట్టణంలో పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. అభ్యర్థుల గెలుపే లక్ష్యం కావాలని సూచించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజలకు చేసిన చూస్తున్న అన్యాయాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రేషన్ బియ్యంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉంటుందన్నారు. అదే విషయాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షురాలు నీరటి అనసూయ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలనుప్రజల్లోకి తీసుకెళ్లాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి