
పెండింగ్ బిల్లులు చెల్లించండి
● యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం
అనంతగిరి: రాష్ట్రంలోని ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం కోరారు. ఇదే అంశంపై ఆగస్టు ఒకటిన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం వికారాబాద్‌లో యూటీఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్పందించి అన్ని క్యాడర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలన్నారు. ఎస్‌ఏ, పీఎస్ హెచ్‌ఎం, జీహెచ్‌ఎం ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. పెండింగ్ బిల్లులు తక్షణం విడుదల చేయాలన్నారు. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఇవ్వాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌లు పునరుద్ధరించాలన్నారు. 5,571 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేయాలని, బీఈడీ, డీఈడీ ఉన్న ఎస్జీటీ ఉపాధ్యాయులను పీఎస్ హెచ్‌ఎంలుగా ప్రమోషన్ ఇవ్వాలన్నారు. జీవో 11 , 12ను అనుసరించి ఎస్జీటీ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ కల్పించాలని, మోడల్ స్కూల్, గురుకుల ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు.
పాఠశాలల్లో గ్రంథాలయం తప్పనిసరి
దుద్యాల్: ప్రతి పాఠశాలలో గ్రంథాలయం తప్పని సరిగా ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉపయోగపడేలా చూడాలని ఎస్‌సీఎఫ్ రాష్ట్ర పరిశీలకులు దీపక్, జైలు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలల కాంప్లెక్స్ సమావేఽశానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రంథాలయం ఏర్పాటు చేసి పుస్తకాలను ఎలా ఉపయోగించుకోవాలో విద్యార్థులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ బిల్లులు చెల్లించండి