
జిల్లా ప్రత్యేకాధికారిగా దివ్య
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాలకు సీనియర్ ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా సెర్ప్ సీఈఓ డి.దివ్యను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె వికారాబాద్ తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలకు కూడా స్పెషల్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు.
జాతీయ స్థాయి శిక్షణకు హెచ్‌ఎం రమేష్
మోమిన్‌పేట: జాతీయ స్థాయి విద్యా శిక్షణ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయుడు రమేశ్ ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని ఎంఈఓ మల్లేశం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆగస్టు17నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో సీసీఆర్‌టీ కేంద్రంలో జరగనున్న జాతీయ విద్యా శిక్షణ కార్యక్రమానికి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉపాధ్యాయుడిగా రమేష్ ఎంపికయ్యారని తెలిపారు.మండలంలోని ఎన్కతల ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంగా రమేశ్ విధు లు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, గౌరి శంకర్,ఉపాధ్యాయులు,సిబ్బంది పాల్గొన్నారు.
ఆలయ పునర్నిర్మాణానికి రూ.లక్ష విరాళం
తాండూరు టౌన్: తాండూరు పట్టణం ఇందిరానగర్‌లో పునర్నితమవుతున్న శ్రీరామ మందిరానికి తన వంతుగా ఓ ఎన్నారై రూ.1,01,000 విరాళాన్ని శుక్రవారం అందజేశారు. హైదరాబాద్ వాస్తవ్యులైన స్వర్ణలత, మనీష్ మిశ్రాలు కెనడాలో స్థిరపడ్డారు. రామ భక్తులైన వారు ఆలయ పునర్నిర్మాణానికి విరాళం అందజేశా రు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యు లు వారికి కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు తమ వి రాళాలు అందజేసి, ఆలయ పునర్నిర్మాణంలో పాత్రులు కాగలరని కమిటీ సభ్యులు కోరారు.
పెన్షన్లు పెంచాల్సిందే
ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్
ప్రశాంత్ మాదిగ
తాండూరు టౌన్: వికలాంగుల, ఒంటరి, వృద్ధుల పెన్షన్లను వెంటనే పెంచాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ గట్టగల్ల ప్రశాంత్ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన తాండూరులో పెన్షన్‌దారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం వెంటనే వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలు, వృద్ధులు, ఒంటరి మహిళల పెన్షన్ రూ.4 వేలకు పెంచాలన్నారు. పెన్షన్ పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఆగస్టు 2న చలో కొడంగల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరవుతారని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ మాదిగ, తాండూరు అధ్యక్షు డు బలరాం మాదిగ, నాయకులు మీరజ్, మో హన్, సంజు, గజలప్ప,గంగమ్మ, వెంకటమ్మ, నిర్మల, లలిత తదితరులు పాల్గొన్నారు.
ఆకస్మిక తనిఖీ
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేకాధికారి సుధీర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. అధికారులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆయన వెంట కమిషనర్ జాకీర్ అహ్మద్ ఉన్నారు.

జిల్లా ప్రత్యేకాధికారిగా దివ్య

జిల్లా ప్రత్యేకాధికారిగా దివ్య