
ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
● జిల్లా కన్వీనర్ నరేంద్రబాబు
అనంతగిరి: ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో, ఆధునిక సాంకేతికత కేంద్రంలో(ఏటీసీ) వివిధ కోర్సుల్లో రెండో దశ ప్రవేశాలు ప్రారంభించినట్లు జిల్లా ఐటీఐ కళాశాలల కన్వీనర్ నరేంద్రబాబు గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, సివిల్, ఎలక్ట్రా నిక్ మెకానిక్, మోటర్ మెకానిక్, కోపా, వెల్డర్ కోర్సుల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అలాగే కొత్తగా అందుబాటులోకి వచ్చిన ట్రేడ్స్‌లు సీఎన్‌సీ మిషన్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, వర్చువల్ అనలైసిస్ అండ్ డిజైనర్, ఇండస్ట్రీస్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ టెక్నీషియన్లలో అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. పది, ఎనిమిదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆగస్టు ఒకటి నాటికి కనీసం 14 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలని, గరిష్ట వయోపరిమితి లేదన్నారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. అభ్యర్థులు ఒకే దరఖాస్తుతో రాష్ట్రంలోని ఏదైనా ఐటీఐ, ఏటీసీకు వెబ్ ఆప్షన్ల ద్వారా ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు. ఆగస్టు ఒకటవ తేదీ సాయంత్రం 5గంటల వరకు లేదా అంతకు ముందు మీ సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలో ఫిజికల్ వెరిఫికేషన్‌కు అన్ని సర్టిఫికెట్లు, అప్లికేషన్ ప్రింట్ కాపీతో హాజరు కావాలన్నారు. లేకుంటే దరఖాస్తు వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉన్నట్లు చూపుతుందని, దీంతో సీటు కేటాయింపునకు అర్హులు కాదన్నారు. అభ్యర్థులు ఈ నెల 31వ తేదీ వరకు ఐటీఐ తెలంగాణ. జిఓవి. ఇన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం, వెబ్ ఆప్షన్ల ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుందన్నారు. ఎంపికై న అభ్యర్థులకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ సమాచారం పంపనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో లేదా సెల్ నంబర్ల 9177472488, 8555865421, 9177954208, 8500465472 సంప్రదించాలన్నారు.