
అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం
కుల్కచర్ల: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని కేంద్ర టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడు గణపురం వెంకటయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంచందర్ తెలిపారు. గురువారం కుల్కచర్లలోని పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు జె.వెంకటయ్య ఆధ్వర్యంలో ఆయా గ్రామాల కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశం కోసం.. ధర్మం కోసం పనిచేసే ఏకై క పార్టీ బీజేపీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల ఆర్థిక అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. బీజేపీని గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం ఆదరిస్తున్నారని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను ఆదర్శంగా తీసుకుని స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సౌమ్యారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఆంజనేయులు, దిశ కమిటీ జిల్లా సభ్యుడు జానకిరాం, మండల ప్రధాన కార్యదర్శి నరేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు మైపాల్, ఓబీసీ మోర్చా నాయకుడు మహేష్, మండల ఉపాధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడు వెంకటయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంచందర్