
సమస్యలపై నిర్లక్ష్యం వద్దు
● విద్యార్థులకు ఇబ్బంది కలిగితే అధికారులదే బాధ్యత ● కలెక్టర్ ప్రతీక్‌జైన్
అనంతగిరి: వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థి సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతీక్ జైన్ హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో వసతి గృహలు, ప్రభుత్వ పాఠశాలు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, వన మహోత్సవం, నర్సరీల నిర్వహణ, సన్న బియ్యం పంపిణీ తదితర అంశాలపై మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండల ప్రత్యేక అధికా రులు వసతి గృహాలను సందర్శించి సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. మెనూ కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ణాలను వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయ న అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా ఇచ్చిన వనమహోత్సవ లక్ష్యాలను పూర్తి చేయాల ని ఆదేశించారు. పెద్ద మొత్తంలో ఈత మొక్కలు నాటాలన్నారు. నర్సరీలను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, ఎం.సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, మండలాల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.