
దరఖాస్తుల ఆహ్వానం
పరిగి: పరిగి ఆర్టీసీ డిపోలో మూడు సంవత్సరాల అప్రెంటీస్ విధానంలో పని చేయడానికి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఎం సుఖేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటీపీఐఎస్,బ్యాక్ అఫ్, డేటా ఫీడింగ్, సిస్టమ్‌కు సంబంధించిన పనులను డిపోలో చేయాల్సి ఉంటుందని తెలిపారు. 2020 తర్వాత డిగ్రీ పూర్తిచేసి 30 సంవత్సరాల లోపు వారు అర్హులన్నారు. ఐటీ, కంప్యూటర్ సైన్స్, గణితంతో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు పరిగి ఆర్టీసీ డీపో, లేదా సెల్ నంబర్ 9347163847, 7569065644లలో సంప్రదించాలన్నారు.
రైతుల రుణం తీర్చుకుందాం
ఏడీఏ రుద్రమూర్తి
తాండూరు రూరల్: నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించి అన్నదాతల రుణం తీర్చుకుందామని ఏడీఏ రుద్రమూర్తి అన్నారు. పొదోన్నతి బదిలీపై కుమురంభీం ఆసీఫాబాద్ జిల్లాకు డీడీగా వెళ్తు న్న ఆయన్ను శనివారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా సన్మానించి వీడ్కో లు పలికారు. ఈ సందర్భంగా రుద్రమూర్తి మాట్లాడుతూ.. అన్నీ ఉద్యోగుల కంటే వ్యవసాయశాఖను అదృష్టంగా భావించాలన్నారు. ఈ కొలువు చేస్తే రైతులతో మంచి సంబంధాలు ఏర్పడతాయని తెలిపారు. రైతులకు సేవచేసే భాగ్యం మనకు రావడం అదృష్టంగా భావించాలన్నారు.కార్యక్రమంలో ఏవోలు కొమురయ్య, పవన్ ప్రీతం, శ్వేతారాణి, అనిత, ఏఈవోలు, ఎరువుల దుకాణం డీలర్లు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పించాలి
కుల్కచర్ల: రానున్న స్థానిక ఎన్నికల్లో మాలలకు ప్రాధాన్యత కల్పించేలా చూడాలని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడుచౌడాపూర్ వెంకటేష్ కో రారు.శనివారం మంత్రి గడ్డం వివేక్‌ను ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. మాలలకు జరుగుతున్న అన్యాయా న్ని దృష్టిలో ఉంచుకుని వారి అభ్యు న్నతికి రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ, పార్టీ పరంగా సముచిత స్థానం దక్కేలా చూడాలని కోరారు.
సమాజాన్ని మార్చే శక్తి
గురువుకే ఉంది
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్
అనంతగిరి: సమాజాన్ని మార్చే శక్తి గురువుకే ఉందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎన్.శంకర్ అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులై జిల్లాలో చేరిన 43 మంది ఉపన్యాసకులకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇంటర్ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయన్నారు. పరిస్థితులకు అనుగుణంగా బోధనలో వినూ త్న పద్ధతులు అవలంబించాలని సూచించారు. కళాశాలల్లో మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రతినిధులు తూడి హన్మంత్ రెడ్డి, భాస్కర యోగి, రాజ్కుమార్, మంజుల పాల్గొన్నారు.
రేపటి ప్రజావాణి రద్దు
అనంతగిరి: బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించినందున ఆ రోజు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రతీక్‌జైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి విషయాలన్ని జిల్లా ప్రజల గమణించి కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు.
దరఖాస్తు చేసుకోండి
కొడంగల్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపక పోస్టులకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వాణిజ్య శాస్ట్రం, తెలుగు, జంతు శాస్త్రం సబ్జెక్టులలో 2 పోస్టులు, కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, హిందీ, పొలిటికల్ సైన్స్ విభాగాల్లో ఒక్కో పోస్టు చొప్పున ఖాళీ ఉన్నట్లు తెలిపారు. పీజీలో ఓసీ, బీసీలకు 55శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 50శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని ప్రిన్సిపాల్ తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం