
ఉధృతంగా వీరణ్ణ వాగు
● కల్వర్టు పైనుంచి వరద ● మర్పల్లి – మోమిన్‌పేట్ మధ్యస్తంభించిన రాకపోకలు ● రెండు గంటల పాటు అవస్థలు
మర్పల్లి: మండలంలోని సిరిపురం, వీర్లపల్లి, మోమిన్‌పేట్ మండలం ఎనికేపల్లి గ్రామాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లు జలమయ్యాయి. సిరిపురం సమీపంలోని వీరణ్ణ వాగు ఉధృతంగా ప్రవహించింది. కల్వర్టు పైనుంచి భారీగా వరద నీరు పారడంతో రెండు గంటల పాటు రాకపోకలు స్తంభించిపోయాయి. వాగుకు రెండు వైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ధారూరు మండలంలో..
ధారూరు: మండలంలో శనివారం 49.2 మిల్లీ లీట ర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే పెద్ద వర్షం. పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమమ్యాయి. పంట పొలాల్లో నీరు నిలిచింది.
నవాబుపేటలో భారీ వర్షం
నవాబుపేట: మండలంలోని ఎత్రాజ్ పల్లి, చిట్టిగిద్ద, పులుమామిడి, లింగంపల్లి, ఎల్లకొండ తదితర గ్రామాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. శుక్ర, శనివారాల్లో 10 సెంటి మెటర్ల వర్ష పాతం నమోదైనట్లు తెలిసింది. ప్రస్తుత వర్షాలతో పంటలకు జీవం పోసినట్లుయ్యింది.