
క్షయ వ్యాధిపై ఆందోళన చెందొద్దు
కుల్కచర్ల: క్షయ వ్యాధి(టీబీ) పట్ల ఎవరూ భయాందోళన చెందొద్దని జిల్లా టీబీ నియంత్రణ అధికారి రవీంద్రయాదవ్, మండల వైద్యాధికారి కిరణ్‌గౌడ్ అన్నారు. టీబీ ముక్త్ అభియాన్‌లో భాగంగా మంగళవారం తిర్మలాపూర్, ఘణపూర్, సాల్వీడు గ్రామాల్లో టీబీ, రక్తపోటు, హెచ్‌ఐవీ, మధుమేహం వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వచ్ఛతను పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవడంతో అనారోగ్య పరిస్థితులు తగ్గుతాయన్నారు. ఎవరూ కూడా వ్యాధుల పట్ల భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల రోగాలకు చికిత్స ఉందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హరిశ్వర్ రెడ్డి, వైద్య సిబ్బంది యాదమ్మ, రాజు, గోపాల్, గౌరీబాయి, తదితరులు పాల్గొన్నారు.
టీబీ నియంత్రణ అధికారి రవీంద్రయాదవ్