
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం
బంట్వారం: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని బీజేపీ కోట్‌పల్లి మండల అధ్యక్షుడు శివకుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలన్నారు. గ్రామాల్లో వేస్తున్న సీసీ రోడ్లన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా మెజార్టీ స్థానాలను గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల జెడ్పీటీసీ ఇన్‌చార్జిగా కృష్ణాయాదవ్, ఎంపీటీసీల ఇన్‌చార్జిగా రావిరాల రవిని నియమించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఓగులాపూర్ రాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ మండల అధ్యక్షుడు శివకుమార్