
యువతను సేవ వైపు మళ్లించాలి
● రామకృష్ణ మఠం అధ్యక్షుడు బోధ మయానంద మహరాజ్
తాండూరు టౌన్: యువతను సామాజిక సేవా త త్పరత వైపు మళ్లించేందుకు శ్రీ రామకృష్ణ సేవా స మితి కృషి చేయాలని హైదరాబాద్ రామకృష్ణ మ ఠం అధ్యక్షుడు శ్రీ పూజ స్వామి బోధ మయానంద మహారాజ్ అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో రామకృష్ణ, వివేకానంద భావ ప్రచార పరిషత్ రాష్ట్ర అర్ధ వార్షిక సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 18 సేవా సమితులు, 71 మంది ప్రతినిధుల భక్త బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత వ్యసనాలకు బానిసలుగా కాకుండా వారిని సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక జీనవం వైపు మళ్లించాలన్నారు. వారిలో ఏకాగ్రతను పెంపొందించి, మానసిక ఒత్తిళ్ల నుంచి దూరం చేయాలన్నారు. సేవా సమితి అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుతోందని, రామకృష్ణ మఠం ద్వారా ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడటం, అనేక అవార్డులు అందుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం శ్రీ రామకృష్ణ ప్రభ అనే ఆధ్యాత్మిక విశ్వాస మాస పత్రిక, బాలల మాస పత్రిక ‘మొలక’ను స్వామీజీలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ భావ ప్రచార పరిషత్ అధ్యక్షుడు స్వామి పూజనానంద మహరాజ్, వేదానంద మహరాజ్, తాండూరు సమితి సభ్యులు సూర్యప్రకాష్, బాలకృష్ణ, మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.