కాంగ్రెస్‌ సంబురాలు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సంబురాలు

Jul 12 2025 6:58 AM | Updated on Jul 12 2025 6:58 AM

కాంగ్

కాంగ్రెస్‌ సంబురాలు

తాండూరు టౌన్‌: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్‌లాలా అన్నారు. శుక్రవారం స్థానిక అంబేడ్కర్‌ చౌక్‌లో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు తినిపించుకుని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే చేయించి, బీసీలకు ఎన్నికల్లో రిజర్వేషన్ల కల్పన కోసం సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కృషి మరువలేనిదన్నారు. వెనుకబడిన తరగతి వర్గాల ప్రజలు సైతం రాజకీయాల్లో రాణించాలనే సదుద్దేశంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాబో యే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తూ తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం దేశ వ్యాప్తంగా కులగణన ప్రక్రియ చేపట్టి బీసీలను రాజ్యాధికారం దిశగా పయణించేలా చూడాల ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ ప్రభాకర్‌గౌడ్‌, నాయకులు సంతోష్‌, వెంకటయ్య, శ్రీనివాస్‌, జిలాని, అనిల్‌, భీంశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలి

సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్‌

తాండూరు టౌన్‌: ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం జరిగిన సంఘం సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయడంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అంతే కా కుండా విద్య, ఉద్యోగ, కాంట్రాక్టులకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు వర్తించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి షుకూర్‌, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మధులత, నియోజకవర్గ అధ్యక్షురాలు అనిత, విజయలక్ష్మి, జగదీశ్వరి, వెంకటేష్‌, పరమేష్‌, రాము, సురేష్‌, శివ, బస్వరాజ్‌ నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకొన్నాం

ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

పరిగి: కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, టీపీపీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్‌ తెలిపారు. శుక్రవారం పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట ఇస్తే తప్పదన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే హామీలన్నీ అమలు చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పరశురాంరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అయూబ్‌, పార్ట పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నేడు జిల్లాకు మంత్రి జూపల్లి

అనంతగిరి: వికారాబాద్‌లో నిర్మించిన ఎకై ్సజ్‌ స్టేషన్‌ నూతన భవనాన్ని శనివారం రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నట్లు జిల్లా ఎకై ్సజ్‌ అధికారి విజయభాస్కర్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు, ఎకై ్సజ్‌ కమిషనర్‌ హరికిరణ్‌ పాల్గొంటారన్నారని ఆయన చెప్పారు.

కాంగ్రెస్‌ సంబురాలు 
1
1/2

కాంగ్రెస్‌ సంబురాలు

కాంగ్రెస్‌ సంబురాలు 
2
2/2

కాంగ్రెస్‌ సంబురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement