
కొడంగల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
● కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి ● పలు అభివృద్ధి పనులకు భూమిపూజ
కొడంగల్: కొడంగల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామ ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీ తిరుపతిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు. కొడంగల్ పెద్ద చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. కొడంగల్, దుద్యాల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లో 112 ప్రాథమిక పాఠశాలల్లో ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ విద్యా బోధన కోసం 265 కంప్యూటర్లను అందజేశారు. కడా కార్యాలయంలో పలువురికి రూ.1,58,28,500 విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. పట్టణంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు రూ.300 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ ఉషారాణి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, యువజన కాంగ్రెస్ సమన్వయ కర్త కృష్ణంరాజు, నాయకులు నయీమ్, ఆసీఫ్‌ఖాన్, శ్రీనివాస్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, దాము తదితరులు పాల్గొన్నారు.