
అర్హులను ఓటర్లుగా నమోదు చేయాలి
బంట్వారం: అర్హులైన వారిని (18 ఏళ్లు నిండిన) ఓటర్లుగా నమోదు చేయాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ సూచించారు. శుక్రవారం బంట్వారం మోడల్ స్కూల్‌లో బూత్ లెవల్ అధికారులు, సూపర్‌వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఓటర్ల వివరాలు తెలుసుకోవాలన్నారు. అంతకుముందు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్‌కుమార్, డీటీ మహేష్, ఎంపీఓ నాగరాజు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బ్యూలా, ట్రైనర్స్ రవీందర్‌రెడ్డి, యాదయ్య, మధుసుదన్‌రెడ్డి, ఆర్‌ఐ రాంగోపాల్, బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ సుధీర్