విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్‌

Jul 12 2025 6:58 AM | Updated on Jul 12 2025 6:58 AM

విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్‌

విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్‌

● కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ ● రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు సన్మానం

అనంతగిరి: దేశ భవిష్యత్‌ దశ దిశను మార్చేది విద్యే అని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అన్నారు. వికారాబాద్‌ పట్టణ పరిధిలోని ఎన్నెపల్లి మైనార్టీ రెసిడెన్షియల్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్త మ ఫలితాలు సాధించిన విద్యార్థులను అలాగే ఇటీవల కళాశాలలో వివిధ విభాగాలకు జరి గి న ఎన్నికల్లో నాయకులుగాఎంపికైన విద్యార్థి నులకు శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య పట్ల సానుకూల శక్తితో ముందుకు వెళ్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఎన్ని సమస్య లు ఎదురైనా శ్రద్ధ, నిబద్ధత, క్రమశిక్షణతో ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. దేశ భవిష్యత్‌ యువత పైనే ఉందని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీదే అన్నారు. న్యాయ, వైద్య, ఐఐటీ తరగతులు నిర్వహించేందుకు చేయూత అందిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన మాక్‌ పోలింగ్‌ వీడియో ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం వసతి గృహంలో విద్యార్థినులతో కలిసి భోజనం చేశా రు.కార్యక్రమంలో అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ హర్ష చౌదరి, కళాశాల ప్రిన్సిపాల్‌ మహమూ దా ఫాతిమా, రిటైర్డ్‌ డీఎండబ్ల్యూఓ హను మంతరావు, నాయకులు హఫీజ్‌, అబ్దుల్‌ బషీర్‌, వెంకట్‌రెడ్డి, ఫక్రుద్దీన్‌, విద్యార్థినుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

దుద్యాల్‌: ఇంటర్‌ విద్యను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ విద్యార్థులకు సూచించారు. మండలంలోని హకీంపేట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటర్‌ జూనియర్‌ కళాశాలను శుక్రవారం ఆయన సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. శ్రద్ధగా చదువుకొని వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. అనంతరం మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ రాజేందర్‌ రెడ్డి అమ్మవారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సంజీవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, యుగంధర్‌ రెడ్డి, ఆలయ చైర్మన్‌ జయరాములు పాల్గొన్నారు. అనంతరం కళాశాలను కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తిరుపతిరెడ్డి సందర్శించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట కడా ప్రత్యేక అధికారి వెంటకట్‌రెడ్డి ఉన్నారు.

సౌకర్యాలు కల్పిస్తాం

బొంరాస్‌పేట: కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అన్నారు. మండల కేంద్రంలో ఈ ఏడాది కొత్తగా ప్రారంభమైన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను శుక్ర వారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధ్యాపకుల బోధనను పరిశీలించారు. సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లా డి సమస్యలు తెలుసుకున్నారు. ఇంటర్‌ విద్యతోపాటు ఎంసెట్‌, నీట్‌, ఐఐటీ పరీక్షల నిర్వ హణకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కళాశాల కు 5నుంచి 10 కిలో మీటర్ల దూరం నుంచి వ చ్చే విద్యార్థులకు త్వరలో ఉచితంగా సైకిళ్లు అందజేస్తామని తెలిపారు. ఫర్నిచర్‌ కోసం రూ.2.50 లక్షలు వెంటనే మంజూరు చేస్తామన్నారు. మరుగుదొడ్ల లే ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెప్పడంతో సమ స్య ను పరిష్కరిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకన్నగౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంచంద్రారెడ్డి, అధ్యాపక బృందం దినేశ్‌, సురేశ్‌, శేఖర్‌, హరికృష్ణ, నాగరాజు, ప్రవీణ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement