
డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం
● కల్తీ కల్లు విక్రయాలను నిరోధించాలి ● ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ● వికారాబాద్‌లో శాఖ కార్యాలయం ప్రారంభం
వికారాబాద్: డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రం వికారాబాద్‌లో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ నూతన కార్యాలయ భవవాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయితో పాటు ఇతర మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. పోలీస్, ఎకై ్సజ్ శాఖల అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి ఇవి ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయో నిఘా పెట్టాలని సూచించారు. ఇందుకోసం అవసరమైతే ఇతర రాష్ట్రాల సహకారం తీసుకోవాలన్నారు.
ఈత, తాటి, కర్జూర చెట్లు పెంచాలి
రాష్ట్ర వ్యాప్తంగా చెరువు కట్టల మీద, గుట్టలపైన, కాల్వల పక్కన ఈత, తాటి, కర్జూర వంటి మొక్క లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రతి గ్రామంలో ఐదు ఎకరాల మేర స్థలంలో వీటిని నాటేలా చూడాలన్నారు. నగరానికి సమీపంలో ఉన్న వికారాబాద్ నుంచి హైదరాబాద్‌కు నీరా, కల్లు ఎగుమతి చేసే విషయంపై దృష్టి సారించాలని తెలిపారు. కల్లు దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ కల్తీ కల్లు విక్రయాన్ని అడ్డుకోవాలని ఆదేశించారు. ఇందుకు పాల్పడుతు న్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రజల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కల్తీ కల్లు, మాదకద్రవ్యాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపా లని మహేందర్‌రెడ్డి, పల్లెలను పాడు చేస్తున్న డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ఎంపీ కొండా అన్నారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ దశరథ్, సూపరింటెండెంట్ విజయభాస్కర్, అదనపు కలెక్టర్ సుధీర్, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ,ఎకై ్సజ్ శాఖ సర్కిల్, సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.