
భోజనం బాగోలేదని ఆందోళన
మర్పల్లి: మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదని, నాణ్యత కూడా పాటించడం లేదంటూ మర్పల్లి కేజీబీవీ విద్యార్థినులు శనివారం ఆందోళనకు దిగా రు. ఉదయం పిల్లలను చూసేందుకు తల్లిదండ్రులు వచ్చారు. పాఠశాలలో భోజనం సరిగ్గా లేదని, తిన లేకపోతున్నామని బాలికలు కుటుంబ సభ్యుల దృష్టికి తెచ్చారు. ఆగ్రహించిన వారుపిల్లలతో కలిసి పాఠశాల ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ.. భోజనంలో తరచూ పురుగులు వస్తున్నాయ ని తెలిపారు. ఒక్క రోజు కూడా మెనూ అమలు కావడం లేదని ఆరోపించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా పిల్లలను నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో విధులు నిర్వహించే కొంత మంది ఉపాధ్యాయులు విద్యార్థి నులను రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నారని తెలిపారు. రోజూ ఒక టీచర్ నైట్ డ్యూటీ చేయాల్సి ఉంటుందని, ఇది కచ్చితంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇది నచ్చని ఓ ఉపాధ్యాయురాలు తోటి సిబ్బంది, విద్యార్థులను రెచ్చగొట్టి ఇలా గొడవలు చేయిస్తోందని తెలిపారు. సదరు టీచర్‌కు రాజకీయ పలుకుబడి ఉండటంతో నైట్ డ్యూటీ చేయడం లేదని పేర్కొన్నారు. విద్యార్థినుల భోజన విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నట్లు వివరించారు.
మర్పల్లి కేజీబీవీలో విద్యార్థినుల నిరసన
ఇది సిబ్బంది పనేనన్న ప్రిన్సిపాల్
నాణ్యమైన భోజనం అందిస్తున్నామని వెల్లడి