కర సేవకుని అంత్యక్రియల్లో ఎంపీ కొండా | - | Sakshi
Sakshi News home page

కర సేవకుని అంత్యక్రియల్లో ఎంపీ కొండా

Jul 14 2025 4:26 AM | Updated on Jul 14 2025 4:26 AM

కర సే

కర సేవకుని అంత్యక్రియల్లో ఎంపీ కొండా

ధారూరు: కర సేవకుడు, బీజేపీ సీనియర్‌ నాయకుడు పత్తి వైద్యనాథ్‌ శనివారం ఉదయం మృతిచెందారు. మధ్యాహ్నం మండలంలోని అంపల్లి గ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొని బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతోపాటు బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్‌ వడ్ల నందు, జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, సీనియర్‌ నాయకుడు పాండుగౌడ్‌, మండల అధ్యక్షుడు రాజునాయక్‌, మాజీ సర్పంచ్‌ బాబయ్య, నాయకులు నరోత్తమ్‌రెడ్డి, ఎం.రమేశ్‌, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాండూరును మరిచే ప్రసక్తే లేదు

మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి

తాండూరు రూరల్‌: ఎవరెన్ని కుట్రలు చేసినా తనకు రాజకీయ జన్మనిచ్చిన తాండూరును మరిచే ప్రసక్తే లేదని మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని దస్తగిరిపేట్‌లో అకాల మరణం పొందిన మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ భగవాన్‌ కరీం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు కరణం పురుషోత్తంరెడ్డి, మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌ పరిమళ, మాజీ సర్పంచ్‌ శేఖర్‌, నాయకులు బోయరాజు, సలీం, రాజశేఖర్‌, రఘు, భగవాన్‌, పుణిత్‌కుమార్‌, అయూబ్‌ఖాన్‌, శివానంద్‌, ఆనంద్‌గౌడ్‌ పాల్గొన్నారు.

విద్యా వ్యవస్థను

పటిష్టం చేద్దాం

ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి

అనంతగిరి: విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్‌ పట్టణంలోని సత్యభారతి గార్డెన్‌లో పీఆర్‌టీయూ జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌ బిల్లలు మంజూరయ్యేలా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలిపా రు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలన్నారు. స్కావేంజర్ల సమస్యలను సాధ్యమైనంత తర్వగా పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గండు లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి పలుగం దామోదర్‌రెడ్డి, జి ల్లా అధ్యక్షుడు కడియాల చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శి అమర్‌నాథ్‌, గౌరవ అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్లపై

రోజుకో మాట

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌

అనంతగిరి: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ పార్టీ రోజుకో మాట మాట్లాడుతోందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ ఆరోపించారు. శనివారం వికారాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయ న విలేకరులతో మాట్లాడారు. ఒకసారి బిల్లు ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తామని, మరోసారి పార్టీ పరంగా అమలు చేస్తామని ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్‌, పార్టీపట్టణ అధ్యక్షుడు గోపాల్‌ ముదిరాజ్‌, నాయకులు రాజేందర్‌ గౌడ్‌, మల్లేశం, గయాజ్‌, లక్ష్మయ్య, సురేష్‌గౌడ్‌, దత్తు, అశోక్‌, మల్లికార్జున్‌, శివకుమార్‌, మల్లేశం, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

కర సేవకుని అంత్యక్రియల్లో ఎంపీ కొండా 
1
1/3

కర సేవకుని అంత్యక్రియల్లో ఎంపీ కొండా

కర సేవకుని అంత్యక్రియల్లో ఎంపీ కొండా 
2
2/3

కర సేవకుని అంత్యక్రియల్లో ఎంపీ కొండా

కర సేవకుని అంత్యక్రియల్లో ఎంపీ కొండా 
3
3/3

కర సేవకుని అంత్యక్రియల్లో ఎంపీ కొండా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement