
ఉపాధ్యాయ సమస్యలపై నిరంతర పోరాటం
అనంతగిరి: ఉపాధ్యాయుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం పీఆర్‌టీయూ ముందుండి పోరాటం చేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కడియాల చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం వికారాబాద్‌లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మండల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కేదార్‌నాథ్, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్, నాయకులు సతీష్‌కుమార్, రమేష్, వీరేశం, జహంగీర్, యాదగిరి, వేణు, శ్రీనివాస్, రాములు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
ఏఎస్పీ బదిలీ
అనంతగిరి: జిల్లా అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న టీబీ హనుమంత్‌రావు రాచకొండ కమిషనరేట్‌కు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయనకు ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశారు. ఎస్పీ నారాయణరెడ్డి శాలువా, పూలమాలలతో ఘనంగా తస్కరించి ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీటీసీ ఏఎస్పీ మురళీధర్, డీఎస్పీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ టెన్త్, ఇంటర్
ప్రవేశాలకు గడుపు పెంపు
షాద్‌నగర్‌రూరల్: దూర విద్యావిధానంలో ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాలకు ప్రభుత్వం గడువును పొడగించినట్లు పట్టణంలోని జియోన్ హైస్కూల్ పాఠశాల హెచ్‌ఎం సుధాకర్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 31వ తేదీ లోపు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
‘పాలమూరు – రంగారెడ్డి’పై స్పష్టత ఇవ్వాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య
కొందుర్గు: పదేళ్ల క్రితమే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ సర్వేకు రూ.10వేలు కోట్లు నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేటాయించారని.. నేటికీ సర్వే చేపట్టకపోవడం బాధాకరమని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. మంగళవారం పార్టీ నాయకులు మాణిక్యరావు, అనిత ఆధ్వర్యంలో జిల్లేడ్ చౌదరిగూడ మండల సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జంగయ్య మాట్లా డుతూ.. ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.9 వేల కోట్ల ఖర్చుతో జూరాల బ్యాక్ వాటరుతో 73 కిలోమీటర్లు నిర్మాణం పనులు చేపడితే 12 మండలాలలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుద్దుల జంగయ్య, మండల కార్యదర్శి వెంకటేశ్ నాయకులు యాదయ్య, భీమయ్య, పద్మ,లక్ష్మి, రాములు, లింగమయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ సమస్యలపై నిరంతర పోరాటం