
పని గంటలు తగ్గించాలి
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 282ను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఎన్‌టీఆర్ చౌరస్తాలో సీఐటీయూ ఽఆధ్వర్యంలో జీవో కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ వైపు కార్మిక సంఘాలు జూలై 9న సార్వత్రిక సమ్మెకు సిద్ధమైతే రేవంత్‌రెడ్డి సర్కార్ జీవోలు తీసుకురావడం ఎంతవరకు సమంజసమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ అడుగుజాడల్లో నడుస్తుందా అని మండిపడ్డారు. ఓవైపు పని గంటలు తగ్గించాలని ఉద్యమిస్తుంటే పనిగంటలు పెంచడం సరైంది కాదన్నారు. కేంద్రం కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. పాశమైలారంలో జరిగిన దుర్ఘటన విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదన్నారు. కార్యక్రమంలో ఆశవర్కర్ల యూనియన్ నాయకులు మంగమ్మ, ఉమాదేవి, చంద్రకళ, మాణెమ్మ, సుజాత, బుచ్చిరెడ్డి, మల్లేశం, వెంకటయ్య, పద్మమ్మ, అరుణ పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ